గత ఆగస్టు 5న కోదాడ – సూర్యాపేట ప్రధాన రహదారిపై స్వరాజ్ ట్రాక్టర్ షోరూం సమీపంలో వర్షపు నీరు, మట్టి రోడ్డుపై నిలిచి యూటర్న్ తీసుకునే ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యను జనసేన పార్టీ ప్రెస్ ద్వారా వెల్లడించింది. స్పందించిన మున్సిపల్ కమిషనర్ సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించినా 50 రోజులు పూర్తవుతున్నా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని జనసేన నాయకులు అన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పసుపులేటి రామారావు, మొలుగూరి సైదులు, నీలం రాజేష్, రాయల సతీష్, వెంకట చారి, షేక్ సత్తార్, పి. మహేష్ చంద్ర, సాధినేని వెంకన్న, జల్లా జనార్ధన్, జనసైనికులు పాల్గొన్నారు.