చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్, సూర్యాపేట జిల్లా కోదాడలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంగళవారం, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంగిశెట్టి గోపాల్‌ను పరామర్శించిన అనంతరం, జియో ట్యాగ్ నిబంధన రద్దు, అర్హులైన కార్మికులకు పింఛన్లు మంజూరు, రూ. 20 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕