తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరానికి ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు సెప్టెంబర్ 30, 2026తో గడువు ముగియనుంది. ఎలాంటి విద్యార్హత లేని 14 ఏళ్లు నిండిన వారు పదో తరగతి పరీక్షలు రాయవచ్చని, ఉత్తీర్ణులు ఇంటర్ను ఒకే సంవత్సరంలో పూర్తి చేసుకోవచ్చని లక్ష్య డిస్టెన్స్ అకాడమీ కోఆర్డినేటర్ అనంతుల సతీష్ బుధవారం తెలిపారు. బైపీసీ, ఎంపీసీ, సీఈసీ కోర్సులు తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు లక్ష్య డిస్టెన్స్ అకాడమీని సంప్రదించవచ్చు.