రైతు వేదికలో నానో ఎరువులు, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ

సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గం అల్వాలపురం రైతు వేదికలో ఆత్మ ఆధ్వర్యంలో నానో రసాయన ఎరువులు, ప్రకృతి వ్యవసాయంపై సోమవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ నివేదిత నానో యూరియా, నానో డీఏపీతో సాగు ఖర్చు తగ్గడంతో పాటు భూసారం పరిరక్షించవచ్చని తెలిపారు. కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త నరేష్ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి నాగయ్య కూరగాయలు, పామాయిల్ సాగుపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రశాంతి, రజని, లింగయ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕