అనంతగిరి మండలంలోని త్రిపురవరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షుడు గొట్టెముక్కుల వీరారెడ్డి శుక్రవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. వీరారెడ్డి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.