కోదాడ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన బలుసుపాటి హరి, సిహెచ్ విన్నీ అనే ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించారు. ఈ విషయాన్ని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒకేసారి ఇద్దరు విద్యార్థులు సీటు సాధించడం పట్ల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్, పట్టణ ప్రముఖులు అభినందించారు. ఈ ఇద్దరు విద్యార్థులు పదవ తరగతిలో టాపర్లుగా నిలిచారు.