కార్పెంటర్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా ఉపేంద్రా చారి

సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో శనివారం  కోదాడ మండల కార్పెంటర్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా ఉపేంద్ర చారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ కుసుమ వెంకటరత్నం బాబు హాజరై, నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు. కార్పెంటర్లందరినీ కలుపుకొని సంఘాన్ని బలోపేతం చేసి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పెంటర్లు, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕