తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌చార్జ్ బండారి మహేందర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం కోదాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో చేపట్టనున్న భూ పోరాటానికి ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, రూ. 28 వేల పెన్షన్, గుర్తింపు కార్డులు వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదని, ఉప్పల్ భగాయత్‌లోని 350 ఎకరాల భూమిని ఉద్యమకారులకు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో పూస శ్రీనివాస్, సంజీవ్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.