నడిగూడెం మండలంలో ముమ్మరంగా యుటిఎఫ్ సభ్యత్వ నమోదు

నడిగూడెం మండలంలో యూటీఎఫ్ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బాధ్యులు ముమ్మరంగా నిర్వహించారు. పలు గ్రామాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులను కలిసి సభ్యత్వం స్వీకరించారు. జిల్లా ఉపాధ్యక్షుడు పి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం పాఠశాలల్లో కుదింపు ఆలోచనను విరమించుకోవాలని, ప్రీ ప్రైమరీ తరగతులు అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని, అల్పాహారం అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల బాధ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్