సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక తొమ్మిదో వార్డు సాలార్జంపేట కాలనీలో బుధవారం జరిగిన గ్రామ భరోసా కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని తెలియజేశారు. యువత చదువుల పట్ల ఆసక్తి చూపాలని రాబోవు రోజులలో సాలార్జంగ్ పేట నుంచి పోలీసులు లాయర్లు ఇంజనీర్లు డాక్టర్లు కావాలని ఆయన ఆకాంక్షించారు.