తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పును తీసుకొస్తున్నాయని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కోదాడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రూ. 13,600 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 17 లక్షల మందికి ప్రతి నెలా ఒక్కొక్కరికి 6 కిలోల ఉచిత సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ల్యాండ్‌మార్క్, గేమ్ ఛేంజర్ పథకమని, స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఇంత పెద్ద స్థాయిలో సన్న బియ్యం పంపిణీ జరుగుతోందని చెప్పారు.