విద్యా రంగ పరిరక్షణ కోసం తలపెట్టిన ధర్నాకు తరలి రావాలి

తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ పరిరక్షణ కోసం జూన్ 5న హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించనున్నారు. బడ్జెట్ పెంపు, ఖాళీ పోస్టుల భర్తీ డిమాండ్లతో ఈ ధర్నా జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. బుధవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో ధర్నా గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాయపూడి చిన్ని, బడుగుల సైదులు, రామ నరసయ్య, ఖాజా మియా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్