వృద్ధాశ్రమ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తా

సూర్యాపేట పట్టణంలోని దూరాజ్‌పల్లి 5వ వార్డులో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో పెన్‌పహాడ్ ఎన్‌ఎస్‌యూఐ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నాని సందీప్ వర్మ తండ్రి పిన్నాని యల్లయ్య మూడవ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హాజరై వృద్ధాశ్రమంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం వృద్ధాశ్రమ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, వృద్ధుల సంక్షేమానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వృద్ధాశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్