కాలుతో తన్నడంతో లారీ కింద పడి యువకుడు మృతి

సూర్యాపేట జిల్లా కోదాడలో ఇటీవల జరిగిన యువకుడి మృతి కేసులో కీలక మలుపు. జూన్ 30న బార్లో రమేష్, మహేష్, యాకుబ్ కలిసి మద్యం తాగుతున్నప్పుడు రమేష్, మహేష్ మధ్య గొడవ జరిగింది. వారిని ఆపేందుకు ప్రయత్నించిన యాకూబ్ రమేష్ కు మద్దతు ఇస్తున్నాడని మహేష్ దూషించి, రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నప్పుడు కాలితో తన్నాడు. దీంతో యాకూబ్ నియంత్రణ కోల్పోయి లారీ కింద పడి తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు, సీసీటీవీ పుటేజీ ఆధారంగా మహేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్