నేడు యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ కు మంత్రుల రాక

దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ (వైటీపీఎస్‌)కు శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ రానున్నారు. పవర్‌ ప్లాంట్‌లోని యూనిట్‌-1ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దీని ద్వారా 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభం కానుంది. అనంతరం కృష్ణాతీరంలో జెన్‌కో టౌన్‌షిప్‌ కోసం భూమి పూజ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్