మిర్యాలగూడ: పేదలకు లక్షలాది ఇళ్లు ఇస్తాం: సీఎం రేవంత్

అభివృద్ధిని చూసి మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మిర్యాలగూడ మండలం గూడూరులో ఏర్పాటు చేసిన ‘ప్రజా పాలన - ప్రజా విజయోత్సవ’ సభలో సీఎం మాట్లాడుతూ.. 'ఏప్రిల్‌లో కొత్త బడ్జెట్‌లో లక్షలాది ఇళ్లు పేదలకు ఇస్తాం. పేదల ఆత్మగౌరవం పెంచే బాధ్యత తీసుకుంటాం. నల్గొండ జిల్లాపై కోపంతో ఎస్‌ఎల్‌బీసీని పక్కనపెట్టారు. నల్గొండ ప్రజలు ఫ్లోరైడ్‌ నీళ్లు తాగడానికి కారణం బీఆర్‌ఎస్‌. కేసీఆర్‌కు పోలీసులు నోటీసు ఇస్తే.. తెలంగాణ జాతికి ఇచ్చినట్టు చెబుతున్నారు' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్