మాడ్గులపల్లి మండలంలోని సీత్యా తండాలో బుధవారం రమావత్ రవి అనే వ్యక్తిని అతని భార్య లక్ష్మి, ఆమె ప్రియుడు కలిసి అతి కిరాతకంగా హత్య చేశారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భార్య ఈ ఘాతుకానికి పాల్పడింది. రవిని తల, ఛాతిపై గట్టిగా కొట్టి చంపిన తర్వాత, లక్ష్మి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి నేరం ఒప్పుకుంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.