హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో మిర్యాలగూడకు చెందిన నల్ల సుధీర్ (46) మృతి చెందారు. శుభకార్య పత్రికలు పంచడానికి మిర్యాలగూడ నుండి హాలియాకు బైక్‌పై వస్తుండగా అనుముల మండలం చెక్ పోస్ట్ బంకాపురం స్టేజి సమీపంలో జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. అటుగా వస్తున్న వారు గమనించి సుధీర్ బంధువులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఏదైనా వాహనం ఢీకొట్టిందా లేదా అదుపు తప్పి పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.