చౌటుప్పల్ జాతీయ రహదారిపై సోమవారం లారీ బీభత్సం సృష్టించింది. లారీకి బ్రేకులు పనిచేయక పోవడంతో సర్వీస్ రోడ్డుపై ఉన్న ఒక బైకు, ఐదు కారులను వరుసగా ఢీకొట్టింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు. డ్రైవర్ లారీని వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.