రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో భాగంగా ఇండ్ల గ్రౌండింగ్ లో నిర్లక్ష్యం వహించడంతోపాటు, పిఎంఏవై గ్రామీన్ ఆన్ లైన్ ఎంట్రీ వివరాల నమోదులో కూడా నిర్లక్ష్యం వహించిన కారణంగా మర్రిగూడ ఎంపీడీవో మునయ్య కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఇందిరమ్మ ఇండ్లపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా మర్రిగూడ ఎంపీడీవో మునయ్య ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ లో నిర్లక్ష్యం వహించారని తెలిపారు.