నిడమనూర్ మండల పరిధిలోని బంటుగూడెం గ్రామానికి చెందిన మెరుగు సోమమ్మ (60) పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే 108 సిబ్బంది యాదగిరి, శివ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆమెను మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.