నాగార్జున సాగర్ జలాశయానికి పోటెత్తుతున్న వరద

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం ప్రాజెక్టుకు 1, 48, 736 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా ఔట్ ఫ్లో 13, 566 క్యూసెక్కులు ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 543. 70 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను 196. 1229 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

సంబంధిత పోస్ట్