నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను తాకిన నీటిమట్టం

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి వరద పోటెత్తడంతో సాగర్ నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నానికి నీటిమట్టం క్రస్ట్ గేట్లను తాకింది. ఈ ఏడాది నెల రోజుల ముందుగా జలాశయానికి వరద ప్రారంభమైంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 546 అడుగులకు చేరుకుంది.

సంబంధిత పోస్ట్