నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను శుక్రవారం కృష్ణమ్మ తాకినది. నాగార్జునసాగర్ నీటి మట్టం 546 అడుగులకు చేరుకున్నది. ఈ ఏడాది నెల రోజుల ముందుగానే వరద ప్రారంభం అయినది. ఇదే వరద ఉధృతి కొనసాగితే వారం రోజులలో సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంటది అని అధికారులు తెలిపారు.