త్రిపురారం మండలం రూఫ్లాతండా గ్రామ పంచాయతీ పరిధి కూన్యా తండా సరిహద్దులో ఉన్న కెనాల్ కాల్వ నిర్మాణ పనులకు సోమవారం స్థానిక సర్పంచ్ ధనావత్ రఘు నాయక్, స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. శాసన సభ్యులు కుందూరు జై వీర్ రెడ్డి నిధులతో 5 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ నిర్మాణ పనుల ద్వారా గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని, ఈ నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు, సర్పంచ్ లకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.