చిట్యాల: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

ఉద్యోగం దొరకక పోవడాన్ని మనస్తాపంగా భావించిన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిట్యాలలో శుక్రవారం జరిగింది. నేరడకు చెందిన అఖిల్ గతంలో ప్రైవేటు ఉద్యోగం చేసినా ఏడాది నుంచి ఖాళీగా ఉన్నాడు. చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో చిట్యాల రైల్వే ట్రాక్ వద్ద నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ కింద పడి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్