ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం నెమ్మికల్లు దండు మైసమ్మ ఆలయం వద్ద చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం తేలువారిగూడెం గ్రామానికి చెందిన చెందిన మోక్షిత్ (4) అనే బాలుడు, సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(s) మండలం నెమ్మికల్లు దండు మైసమ్మ దేవాలయం వద్ద రోడ్డు దాటుతుండగా ట్రాక్టర్ ఢీ కొట్టింది. బంధువుల శుభకార్యానికి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే బాలుడు మృతి చెందాడు.