కడుపునొప్పితో వివాహిత ఆత్మహత్య

చిట్యాల మండలం ఏపూర్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల వివాహిత మందుల లక్ష్మమ్మ, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వైద్యుల చికిత్స తీసుకుంటున్నా నొప్పి తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్