నకిరేకల్: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్

కేతేపల్లి మండలం కొర్లపహాడ్ స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం గురువారం జరిగింది. నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన వెంకన్న బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా కొర్లపహాడ్ స్టేజి వద్ద తను వెళుతున్న బైక్ ను సూర్యాపేట వైపు వెళ్తున్న ట్యాంకర్ లారీ ఢీ కొట్టింది. దీంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం లారీ మధ్యలో ఇరుక్కుపోయి నుజ్జు నుజ్జు అయ్యింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్