నల్గొండ: గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య

నల్గొండ జిల్లా క‌ట్టంగూర్‌ మండలంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామంలో కొత్త నాగరాజు (29) అనే యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాపీ మేస్త్రీ అయిన నాగరాజు మద్యానికి బానిసై పనికి వెళ్లడం మానేశాడు. భార్య నాలుగు రోజుల క్రితం కుమార్తెను తీసుకుని తల్లిగారింటికి వెళ్లిపోవడంతో మనస్థాపానికి గురైన నాగరాజు, మంగళవారం సాయంత్రం గ్రామ శివారులోని వ్యవసాయ పాలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్