ఐదుగురు కొడుకులున్నా అనాథలైన వృద్ధ దంపతులు

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం రామంజపురం గ్రామపంచాయతీలో ఐదుగురు కొడుకులు ఉన్నా, 70 ఏళ్ల ఓంకార్, 65 ఏళ్ల మారోజు ఈశ్వరమ్మ అనే వృద్ధ దంపతులు అనాథలుగా మారారు. వారి కొడుకులు వేరే ప్రాంతాల్లో స్థిరపడి, తల్లిదండ్రులతో ఎటువంటి సంబంధం లేదని చెప్పడంతో మనస్థాపానికి గురైన ఈ వృద్ధ దంపతులు, తమ గోడు వెళ్లబోసుకునేందుకు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. గత 15 సంవత్సరాలుగా సొంత గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న వీరికి, ఆరోగ్యం సహకరించకపోవడంతో పనులు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్