చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్ బస్సు

చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులో ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఇంటర్ సిటీ ట్రావెల్ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. డ్రైవర్ యాదగిరి మద్యం మత్తు పరీక్షలో 185 రీడింగ్ నమోదైనట్లు సమాచారం. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ట్రావెల్ బస్సు నిర్వాహకులు ప్రయాణికులను మరో బస్సులో విజయవాడకు తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕