తీర్థయాత్రల నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి

నార్కట్ పల్లి: బంధువులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన కుటుంబం తిరుగు ప్రయాణంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మే 29న బయలుదేరిన ఈ బృందం, జోగులాంబ, యాగంటి, అహోబిలం, అరుణాచలం సందర్శించి, జూన్ 2న రాత్రి నెల్లూరు బీచ్ నుంచి తిరుగు ప్రయాణమైంది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న డీసీఎంను మినీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తొలగించిన సీట్ల స్థానంలో పడుకున్న 10 ఏళ్ల ఎలగందుల ద్రోనిక ఊపిరాడక మృతి చెందింది. బస్సులో ప్రయాణిస్తున్న 14 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో కార్తికేయ, శ్రీయాన్ అనే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటికి చేరుకోవడానికి గంట సమయం ఉండగానే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్