పోస్ట్ మెట్రిక్ దివ్యాంగ విద్యార్థులకు వసతి సౌకర్యం

నల్గొండ పట్టణంలో పోస్ట్‌ మెట్రిక్ విద్యను అభ్యసిస్తున్న దివ్యాంగ బాలురకు నల్గొండ పట్టణంలోని రామగిరిలో ఉన్న ప్రభుత్వ దివ్యాంగుల కళాశాల బాలుర వసతి గృహంలో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయని వార్డెన్ వెంకట్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజనంతో పాటు నెలకు రూ. 250 కాస్మోటిక్ ఛార్జీలు, ట్రంక్ బాక్స్, ప్లేట్, గ్లాసు, యూనిఫామ్, బెడ్‌షీట్లు, నోట్‌బుక్స్ ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వసతి గృహాన్ని సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్