మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ, తనను మానసికంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఒకేసారి విషమిచ్చి చంపేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మంత్రులు, మహిళా ఐఏఎస్ అధికారులపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేటింగ్‌లు, వ్యూస్ కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు.