నల్గొండ: రూ. 999కే 147 గజాల పూర్తి స్లాబ్ ఇల్లు!

నల్గొండ పట్టణంలో రూ. 999కే 147 గజాల పూర్తి స్లాబ్ ఇల్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తూ ఒక లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు. ఈ ఆరు గదుల ఇంటికి ప్రస్తుతం నెలకు రూ. 6000 అద్దె వస్తుందని నిర్వాహకులు తెలిపారు. DEO ఆఫీస్ సమీపంలో ఉన్న ఈ ఇంటి కోసం 3,000 కూపన్లు మాత్రమే విడుదల చేశారు. మార్చి 22, 2026న డ్రా నిర్వహించనుండగా, విజేతకు రిజిస్ట్రేషన్ ఖర్చుతో సహా ఇంటిని అప్పగిస్తారు. ఇల్లు లేని వారికి తక్కువ మొత్తంలో ఇల్లు పొందే అవకాశంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఇంటి యజమాని రమేష్, తక్కువ ధరకే ఇల్లు అందించాలనే ఆలోచనతోనే ఈ లక్కీ డ్రాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటిని చూడాలనుకునేవారు బ్రోచర్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేసి లొకేషన్‌కు వెళ్లవచ్చు.

సంబంధిత పోస్ట్