నల్గొండ కార్పొరేషన్ రికార్డు

నగర పాలక సంస్థ (NLG కార్పొరేషన్) ముందస్తు ఆస్తి పన్ను వసూళ్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వం కల్పించిన 5 శాతం రాయితీ గడువు ముగిసే సమయానికి రూ.8.80 కోట్లు వసూలు చేసి మున్సిపల్ యంత్రాంగం సత్తా చాటింది. గతేడాది ఏప్రిల్‌లో రూ.6.50 కోట్లు వసూలు కాగా, ఈసారి అదనంగా రూ.2.30 కోట్లు వసూలు చేయడం విశేషం. మొత్తం రూ.18.50 కోట్లు రావాల్సి ఉండగా కేవలం నెల రోజుల్లోనే 13వేల మంది నుంచి రూ.8.80 కోట్లు వసూలు చేశారు.

సంబంధిత పోస్ట్