నల్గొండ: ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి దుర్మరణం

సోమవారం రాత్రి మాడుగులపల్లి మండలంలోని కుక్కడం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేములపల్లికి చెందిన వంగర సాయి అనే యువకుడు దుర్మరణం చెందాడు. పెళ్లికి వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా, కారు బలంగా ఢీకొట్టడంతో సాయి అక్కడికక్కడే మరణించాడు. కొడుకు మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్