కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పింది. ప్రమాదవశాత్తు మరణించినా లేదా అంగవైకల్యం కలిగినా, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ‘ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం’ను అమలు చేయనుంది. జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి ఈ పథకం వర్తిస్తుంది. నల్గొండ జిల్లాలో దాదాపు 9 లక్షల మంది దీనివల్ల లాభం పొందనున్నారు.