ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేస్తే కఠిన చర్యలు

విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి హెచ్చరించారు. 24 గంటలు ప్రజలకు సేవ చేస్తున్న తమ సిబ్బందిపై దాడి చేస్తే సహించబోమని ఆయన స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలో విధినిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌ తల్లా రామ్ కుమార్ పై అకారణంగా దాడి చేసి, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన వెంకటేశం అనే వ్యక్తిపై నల్గొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల విధినిర్వహణకు ఆటంకం కలిగిస్తూ వారిపై భౌతిక దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నాగిరెడ్డి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్