పరీక్షకు వెళ్తూ స్నేహితులిద్దరూ దుర్మరణం

నల్గొండ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇంటర్ పరీక్ష రాయడానికి వెళ్తున్న గైగుల్ల వంశీ(20) మరియు అతని స్నేహితుడు గుడిసె రవి(21)లు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా చందనపల్లి గ్రామం వద్ద ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జనరల్ ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ఒకేరోజు మరణించడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు.

సంబంధిత పోస్ట్