వాగులో గల్లంతైన ఇద్దరు యువకులు: విషాదంలో కుటుంబాలు

హాలియా వాగు వద్ద బిర్యానీ తిన్న ముగ్గురు మిత్రులలో ఇద్దరు గల్లంతయ్యారు. మంగళవారం సాయంత్రం పెద్దవూర మండలం సిరసనగండ్ల గ్రామానికి చెందిన బబ్లుచారి(17), నిడమనూరు మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన ఆలేటి కార్తీక్‌(14)లు హాలియా వాగు వద్ద ఎడమ కాల్వ వంతెన వద్ద బిర్యానీ తిన్నారు. చేతులు కడుక్కోవడానికి కాల్వలోకి దిగిన కార్తీక్‌ కాలుజారి పడిపోగా, అతన్ని కాపాడే ప్రయత్నంలో బబ్లుచారి కూడా నీటిలో మునిగి గల్లంతయ్యారు. మూడో స్నేహితుడు నాని కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బబ్లు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్