ఇసుక సొరంగంలో మట్టి కూలి మహిళ మృతి

కనగల్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కనగల్ గ్రామానికి చెందిన పాలకూరి సునీత (45) శనివారం బుడమర్లపల్లి వాగులో ఇసుక తవ్వకాల సందర్భంగా జరిగిన ప్రమాదంలో మృతి చెందింది. రోజూలాగే ట్రాక్టర్లలో ఇసుక నింపే పనికి వెళ్లిన సునీత, సొరంగం లోపల ఇసుక ఎత్తుతున్న సమయంలో మట్టి కూలి ఆమెపై పడింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సునీత మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్