వృద్ధుడిని గొంతు నులిమి హత్య చేసిన మహిళ

నల్గొండ మండలం అనంతరామారంలో గురువారం నాడు దారుణం చోటుచేసుకుంది. 20 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ఆవుల మల్లయ్య (70)ను లక్ష్మమ్మ (60) కర్రతో దాడి చేసి, గొంతు నులిమి హత్య చేసింది. ఇటీవల మనస్పర్థల కారణంగా విడిగా ఉంటున్న వీరి మధ్య మద్యం సేవించిన తర్వాత జరిగిన వాగ్వాదం ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్