నల్గొండ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో కానుకుర్తి సాయికుమార్ (21) అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నార్కట్‌పల్లికి చెందిన సాయికుమార్ మరణంపై రైల్వే ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ, లోకో పైలట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.