అనారోగ్యం తో ప్రధానోపాధ్యాయుడు మృతి

హుజూర్ నగర్ నియోజక వర్గం గరిడేపల్లి మండలం ప్రాథమిక పాఠశాల గారకుంటతండ ప్రధానోపాధ్యాయులు బి. నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన యూటీఎఫ్ సంఘ సభ్యునిగా, గతంలో మెల్లచెరువు మండల అధ్యక్షునిగా పనిచేసి సంఘం బలోపేతానికి కృషి చేశారు. ఆయన మృతి యూటీఎఫ్ సంఘానికి తీరని లోటు అని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమయ్య, అనీల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, పలు మండలాల అధ్యక్ష కార్యదర్శులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్