సూర్యాపేట కొత్త బస్టాండ్‌లో మరుగుదొడ్ల నిర్వహణ లోపం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. మహిళల మరుగుదొడ్లు మరమ్మతులో ఉండటంతో, పురుషుల విభాగాన్ని మహిళలకు కేటాయించారు. దీనివల్ల పురుషులు, మహిళలు ఇద్దరూ అవస్థలు పడుతున్నారు. అపరిశుభ్రత, దుర్వాసనతో ప్రయాణికులు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు వెంటనే శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.