సూర్యాపేట: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

భూ భారతి పోర్టల్‌లో వివరాల నమోదులో తప్పులు దొర్లకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. అలాగే జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్