సూర్యాపేటలో 50 వాహనాలు సీజ్, ఇళ్లలో పోలీసుల సోదాలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అన్నదురై నగర్‌లో మంగళవారం సాయంత్రం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో, రూరల్ సీఐ రాజశేఖర్ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో 50 మంది పోలీసుల బృందం పాల్గొంది. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భాగంగా కాలనీలోని ప్రతి ఇంటినీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో 50 వాహనాలను సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕