సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ షటిల్ గ్రౌండ్లో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియోగ్రాఫర్గా పనిచేస్తున్న వెలుగు కరుణాకర్ (60) షటిల్ ఆడుతుండగా రాత్రి 7. 45 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే సహచరులు సీపీఆర్ చేసి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కరుణాకర్ గతంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎక్స్రే విభాగంలో పనిచేశారు. వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడిగానూ సేవలందించారు. ఆయన మృతితో సహచరులు, షటిల్ క్రీడాకారుల్లో విషాదం నెలకొంది.